నిమ్మ గడ్డి తో చేసిన టీ తీసుకుంటే జీవక్రియలు వేగవంతం కావడమే కాక జీర్ణకోశానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పోతాయి అంటున్నారు డాక్టర్లు.చక్కని పరిమళం వెదజల్లే నిమ్మగడ్డి ఒత్తిడి తగ్గిస్తుంది హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక  ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి.ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది నోటి ఇన్ఫెక్షన్లు రానివ్వదు.దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది నిమ్మగడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గిస్తాయి.దీనిలోని ఎసెన్షియల్ నూనెలు స్వాంతన కలిగిస్తాయి.

Leave a comment