బరువు తగ్గేందుకు ఆల్కలైన్ వాటర్ మంచిదని అంటున్నారు కానీ ఆ పని నిమ్మకాయ నీళ్లు కూడా చేస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్.   ఆల్కలైన్ అంటే క్షార గుణం ఉండటం నిజానికి శాకాహారం లో ఆకుకూరలు, గింజలు కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి కనుక వాటి వల్ల శరీరంలో క్షారత్వం పెరుగుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని విటమిన్ సి సహా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ఫ్రీరాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కేవలం ఆల్కలైన్ వాటర్ లక్షణాలున్న నిమ్మరసం నీళ్లతో బరువు తగ్గరు మనం ఎంత తింటున్నాం ఎంత శక్తి ఖర్చు చేస్తున్నాం అన్న దానిపైన బరువు తగ్గడం ఆధారపడి ఉంటుంది.

Leave a comment