Categories
నెయిల్ కలర్స్ వల్లనో, సరిగా క్లీనింగ్ లేకపోయినా తరచూ పెయింటింగ్స్ వేయటం వల్ల నెయిల్ బాడి పై పసుపు పచ్చని మరకలు పడతాయి. వాటిని పాలిష్ ఎక్కువ చేసి కవర్ చేయాలన్న మరి పాడైపోతాయి. ఈ మరకలు తొలగించాలంటే తాజా నిమ్మరసాన్నిగోళ్ళ మరకల పై పూసి కొద్ది నిమిషాలు వదిలేసి పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిస్తే పోతాయి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే గోళ్ళు మెరుస్తూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో మూడు వంతులు నీళ్ళు కలిపి రెండు నిమిషాలు గోళ్ళు అందులో ఉంచి బ్రష్ తో రుద్దితే మరకలు మాయమైపోతాయి. మరకలు రంగు మారటం జరిగినప్పుడు లెవెండర్ లేదా టిట్రీ ఆయిల్ తో కూడా పొగొట్టవచ్చు.