ఇంట్లో తీరిగ్గా వున్న, ఏదైనా తెరిగ్గా సినిమా చూస్తూన్నా లేదా ఒత్తిడి అనిపించినా ఎదో ఒక్కటి తినేయాలనిపిస్తుంది. అప్పుడు నిమ్మజాతి పండ్లే అందుబాటులో వుంచుకుంటే అవి చాలా మేలు చేస్తాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లలో వుండే సి విటమిన్ రక్తంలో చక్కర స్ధాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి సిట్రస్ రకాలు. ఇన్ ఫెక్షన్లు రానీయవు జలుబు, జ్వరం, దగ్గు రానీయవు. ఒక వేల వచ్చినా తొందరగా కోలుకునేలా చేస్తుంది. అలసట ఎంత మాత్రం రాదు. ఎండ కారణంగా నల్లబడిన చర్మం యధా స్ధితికి వస్తుంది. వార్ధక్యపు భయాలు దగ్గరవ్వవు. ఇవి మంచి పోషకాలు.

Leave a comment