ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని స్లేర్ స్కల్ లో చిత్ర కళను అభివృద్ధి చేసుకుంది. లండన్ లో భరతీయ సాంస్కృతిక విభాగం నెహ్రు నెంటర్ చేసిన షో కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటారామె. గతంలో ఈమె గర్ల్ చైల్డ్ ధీమ్ లో బొమ్మలు వేసేది ఇప్పుడు కామాసూత్ర పుస్తకం స్పూర్తి తో కపుల్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఎలాంటి టార్గెట్ లేకుండా ఎప్పుడు బొమ్మలు వేస్తూనే వుండాలి అన్నది దీపానాథ్ ధ్యేయం.

Leave a comment