అద్భుతమిన ఎన్నో బ్రాండ్స్ కు ఆమె మోడల్. అత్యధిక పారితోషకం తీసుకునే అందాల నటి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రేమించిన వాడిని పెళ్ళాడిన అనుష్కా శర్మ ఇప్పటికీ జీవితంలో  వైఫల్యాలనేవి సహజం అనే అంటుంది. ఇవ్వాళ ఇంత పెద్ద యాక్టర్ ని అయినంత మాత్రానా మొదటి నుంచి అన్ని కలసి  వచ్చాయని అనుకోవద్దు. చాలా చిన్ని  వయస్సులోనే ఎన్నో చెడు అనుభవాలు రుచి చూసాను. అవకాశాలు వచ్చాయి, సెటిల్ అవ్వుతున్నా అనిపించేది, అవన్నీ వెనక్కి పోయేవి. నేనయిటే అవన్నీ మిస్ అయినా ఇప్పుడు నిరాశే పడలేదు. కొత్త ఉదయం నా జీవితంలో ఎదురవ్వాలని అవకాశం వచ్చే వరకు కష్టపడ్డాను . నేను ఎవరికన్నా ఇచ్చే సలహా ఇదే . ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తిరగోడ్డు అనే చెప్పుతానంటుంది అనుష్కా శర్మా.

Leave a comment