ప్రపంచం చాలా మారిపోయింది. మహిళలపై సమాజం విధించిన ఎన్నో నిషేధాలు చెదిరిపోతున్నాయి. ఈ విషయం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కర్మకాండాల సందర్భంగా ప్రపంచం అన్ని టీవీల్లో వాజ్ పేయి పెంపుడు కూతురు నమిత కౌల్ భట్టాఛార్య ఆయిన చితికి నిప్పు పెట్టటం, తర్వాత ఆయన అస్థికలు నిమజ్జనం చేయటం అందరూ చూశారు. సామాజిక పోకడల పరిశోధకులు దీన్ని గొప్ప మార్పుగా అభివర్ణించారు. తల కొరివిపెట్టటం, స్మశానానికి వెళ్ళటం ఇతర క్రియలు ఏవి మహిళల వ్యవహారాలుగా ఇప్పటి వరకు పరిగణించటం లేదు. ఈ మధ్యనే మార్పులు ఒక్కొక్కటి తెస్తున్నాయి. స్మశానంలో కాటికాపరి గా మహిళలు ,పూజలు క్రతువులు జరిపించే మహిళలు ,పురుషులకు మాత్రమే అనుకొనే ఎన్నో రంగాల్లో మహిళలు ప్రవేశించి విజయవంతంగా కొనసాగుతున్నారు.

Leave a comment