సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా  బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి దుస్తుల కోసం పది లక్షల రూపాయల ఖర్చుతో తన భర్త తో పరిచయం అయినప్పటినుంచి నిశ్చితార్ధం వరకు తీయించుకున్న ఎన్నో ఫోటోలను పసిడిపువ్వుల్లా ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై డిజైన్ చేయించుకుంది . నెల రోజుల పాటు ఈ డిజైన్ లెహెంగా ను వంద మంది డిజైనర్లు కొట్టారు. క్రెషా  వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివి ముంబై లో ఒక బ్రాండ్ ప్రారంభించింది. పెళ్లి కూతుళ్ళకు ప్రత్యేక డిజైనింగ్ చేయరు. 233 దేశాలకు పంపుతోంది.ఇప్పుడు తాజా సమంత నిశ్చితార్ధపు చీరలో క్రెషా  తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ అయిపోతుంది.

Leave a comment