ఎక్సర్ సైజ్ ను బట్టి ఊపిరి తీసుకునే పద్దతిలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. వర్కవుట్స్ చేసేటప్పుడు శ్వాసపైన ధ్యాస ఉంచాలి. బరువులు ఎత్తే వ్యయామాలు,పుషప్స్,,బైసిప్స్ చేసేటప్పుడు గాలి బయతకి వదలాలి. మోచేతుల పైన శరీరం బరువు నిలిపు శరీరం నేలకు వంచి వ్యయామాలు చేసేటప్పుడు గాలీ పీల్చుకోవాలి.వ్యయమానికి తగ్గట్లు గాలి పీలుస్తూ ఉంటే అలసిపోకుండా ఉంటారు. స్ట్రెచప్స్ చేసేటప్పుడు నెమ్మదిగా తక్కువగా గాలి పీల్చాలి. అలా చేయడం వల్ల పొట్ట కండరాలకు కూడా వ్యయామం దొరుకుతుంది. పరిగెత్తే సమయంలో వేగానికి అనువుగా గాలి పీల్చాలి. నడిచే సమయంలో వ్యయామ పరికరాలు వాడుతున్నప్పుడు శ్వాసించే తీరులో మార్పు చేసుకోవాలి.

Leave a comment