ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు ఎం తింటున్నాం అన్నది గమనించుకోవాలి. టి.వి చూస్తూ ఏదైనా చదువుకుంటూ రిలాక్స్డ్ గా తినడం సమస్య లేకుండా ఎక్కువ తింటాం. ఖచ్చితంగా డైట్ చేసే పదార్ధాలు ఏవి రుచిగా వుండవు. అందుకని రుచిగా వున్న మంచి ఆహారం తిన్నా తప్పు లేదు ఎంత పరిణామం లో తింటున్నామన్నది చూసుకోవాలి. పిచు, నీరు, ప్రోటీన్లు వున్న పదార్ధాలు బాగా తినాలి. కాలరీలకు దూరంగా ఉండలి. ఖచ్చితమైన డైట్ గురించి అయితే ఒక బుక్ మైన్టైన్ చెయ్యాలి. తప్పని సరిగా పది, పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. బాగా నిద్రపొతే శరిరం రిలాక్స్డ్ గా వుంటుంది. మెదడు పైన ఒత్తిడి తగ్గిపోతుంది. ౩౦,40 నిమిషాల వ్యాయామం చేసి తీరాలి. దీనికి ఏ కారణం చేతను వాయిదా వద్దు.

Leave a comment