ఇప్పుడు మళ్ళీ నో షుగర్ ఛాలెంజ్ ముందుకు వస్తుంది దీన్ని రెండేళ్ళ క్రితం ప్రారంభించిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా . హెల్ది బాలెన్స్ లైఫ్ కోరుకొంటున్నా యువతరాన్ని దీన్ని సవాల్ గా తీసుకోమంటున్నారు . మొదటి సారిగా ఈ ఛాలెంజ్ తీసుకొంటూనే మొత్తం ఆహారంలో చక్కర తీపి పదార్దాలు లేకుండా చూసుకోవాలి . స్వీయ నియంత్రణ తో ఉండాలి . లైఫ్ స్టయిల్ మార్చుకునేందుకు ఈ 30 రోజుల ఛాలెంజ్ ఫాలో అవ్వాలి . షుగర్ స్వీట్లు లేకుండా నెలరోజులు గడిపితే ఈ సవాల్ తో ఆరోగ్య దిశగా ఒక అడుగు వేసినట్లే అంటారు పూజా మఖిజా ఈ ఛాలెంజ్ ని ఎంతో మంది సెలబ్రెటీలు తీసుకొన్నారు కూడా .

Leave a comment