ఏదైనా అతిగా చేస్తే నష్టమే .స్మార్ట్ యుగంలో ఈ అతి అన్నిరకాల సమస్యలకు కొత్త ఫోబియాలు కు దారితీస్తుంది .పీపుల్ వర్డ్ గా కేంబ్రిడ్జ్ ప్రకటించిన నోమో ఫోబియా  కూడా ఈ అతి వల్ల ఉత్పన్నమైన మానసిక  సమస్య .నోమో ఫోబియా  అంటే ఫోన్ చేతిలో లేక పోతే కలిగే ఆందోళన నో మొబైల్  ఫోన్ ఫోబియాకు సంక్షిప్త  రూపం ఇది . ఫోన్ స్వీచ్ ఆఫ్ అయిపోతే కంగారు పడకండి , లో బ్యాటరీ మెసేజ్  రాగానే ఆందోళన , నెట్వర్క్ రాకపోతే చిరాకు . నిముషానికి ఓసారి వాట్సాప్ ఓపెన్ చేసి ఏమైనా మెసేజ్ లు వచ్చాయేమో చూసుకోవటం ఫోన్ చూడకుండా ఉండలేకపోవడం నోమో ఫోబియా  లక్షణాలు .ఈ ఫోబియా వల్ల శారీరకంగా , మానసికం గా ఇబ్బందే  అంటున్నారు నిపుణులు .సాధ్యమైనంతలో ఫోన్ కాస్త దూరంగా ఉంచడం అలవాటు చేసుకోండి ఈ ఫోబియా బారిన పడకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment