నిద్ర పోతే నొప్పి తగ్గు ముఖం పడుతోంది అంటారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు నిద్ర పోయే వాళ్ళలో నొప్పి తగ్గించే న్యూరోట్రాన్స్ మీటర్ విడుదలై అది అనస్తేషియాలాగా పని చేస్తుంది. నొప్పి కలిగించే ఇబ్బంది శరీరానికి వస్తే వెంటనే నిద్రకోసం ప్రయత్నం చేయమంటున్నారు శాస్త్రజ్ఞులు. నిద్ర అనేది సహాజమైన మత్తు మందు అని ,అది ఎలాంటి బాధనైన మాయం చేస్తుందనీ చెపుతున్నారు. అందుకే అంత విలువైన నిద్రను దేరం చేసే ఎలాంటి అలవాటు అయినా పక్కన పెట్టమని ఒక వేళకు నిద్ర పొమ్మని చెపుతున్నారు. అనారోగ్య సమయంలో నొప్పి శరీరాన్ని బాధించే సమయంలో నిద్రవస్తే నొప్పి చాలా వరకు తగ్గిపోతుందట.

Leave a comment