సాధారణంగా వ్యాయామం చేశాక కండరాలు ,జాయింట్లు నొప్పులుగానే ఉంటాయి. సాఫ్ట్ టిష్యులతో అసౌకర్యం ఉంటుంది. భుజాలు ,ఛాతీ ,బైసెప్స్ దగ్గర ఇలాంటి నొప్పులు ఉంటాయి. నొప్పి ఉన్నచోట ఐస్ పెడితే ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గకుండా అదే రకంగా మజిల్స్ ని శ్రమపెట్ట కూడదు.ముందు రెస్ట్ ,రికవరీ అవసరం సోర్ నెస్ తగ్గేందుకు స్ట్రెచ్ చేయాలి. అనుకొన్న లక్ష్యం కోసం శక్తి మించి వ్యాయామం చేయకూడదు. ఒక్కోసారి ఆసనాలు వేసేటప్పుడు పాశ్చర్ సరిగ్గా లేకపోయినా జాయింట్లు నొప్పులు వచ్చేస్తాయి. కాంప్స్ కూడా కారణం కావచ్చు. పోషకాహారం పరిగ్గా అందటం లేదేమో చెక్ చేసుకోవాలి. ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా తీసుకోవాలి.

Leave a comment