హీల్స్ చాలా ఫ్యాషన్ గా ఉంటాయి . కానీ మొదటి సారి వేసుకొంటున్నప్పుడు మాత్రం జాగ్రత్త అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజంతా వేసుకొనే ఉంటే ఒత్తిడికి పాదాల నొప్పులు రావటం ఖాయం .హీల్స్ వేసుకొనే ముందర పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకొని చెమట పట్టకుండ పాదాల కింద పౌడర్ చల్లాలి లేకపోతే పాదాలు జారుతాయి. కారు నడిపే సమయంలో హీల్స్ దూరంగా పెట్టేయాలి. బ్రేక్ వేయటం సమస్య అవుతుంది. హీల్ సోల్ మెత్తగా ఉన్నది తీసుకోవాలి. గట్టిగా ఉంటే మోకాళ్ళు నొప్పులేస్తాయి. రెండు మూడు రోజులకొకసారి చెప్పులపైన వంటసోడా చల్లి పొడి బట్టతో తుడవాలి.చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకొంటే హీల్స్ తో కంఫర్ట్ గానే ఉండవచ్చు.

Leave a comment