ఎప్పుడో ఒకప్పుడు పత్యంగా తినే బ్రెడ్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ రూపం మార్చేసుకుంది. కోరిన రంగుల్లో నోరూరిస్తుంది. రంగుల కాయగురల్ని కలగలిపి చూడగానే తినాలనిపించేటట్లు మార్కెట్లో ప్రత్యక్షమైంది. పాలకూర లో బీట్ రూట్,చిలగడ దుంప, క్యారెట్ ,గుమ్మడి, టమాటాల పోషకాల నిలయంగా మార్చారు పాకశాస్త్ర నిపుణులు. ఈ రంగుల బ్రెడ్ తయారీ కష్టమే. కూరగాయాలు పుచ్చు వాసన రాకుండా డి హైడ్రెడ్ చేసి పోడి రూపంలోకి మారుస్తారు. దాన్ని బ్రెడ్ పిండిలో కలిపేసి రేయిన్ బో రొట్టెలు తయారు చేస్తారు. ఇప్పుడు బర్గర్లు కూడా ఈ రంగుల రొట్టెలతోనే తయారవుతున్నాయి. ఇవన్ని పూర్తిగా ఆకుకూరలతో తయారు చేసేవి క్యారెట్ తో ఆరెంజ్ కలర్ ని బీట్ రూట్ లో గులాబీ రంగుని సృష్టించారు. అలాగే మిగిలిన రంగులన్ని కాయగురల రంగులే. ఇప్పుడిక పిల్లలు బ్రెడ్ బోర్ అనటం మానేస్తారు.

Leave a comment