యాభై రెండేళ్ల కవిత ప్రస్థానంలో 14 సంకలనాలు తీసుకొచ్చారు లూయిస్ గ్లాక్. పులిట్జర్,నేషనల్ బుక్ అవార్డ్ లతో సహా అనేక ప్రతిష్టాత్మిక పురస్కారాలు అందుకొన్నారు సాహిత్వభిమానులకు ఆమె ఒక సెలబ్రెటీ. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా చేస్తున్న గ్లాక్. నోబెల్ వస్తుందని ఊహించలేదు అంటోంది అందరితోనూ బాగా కలిసిపోయే తత్వం నాది నా కష్టాలు,సంతోషాలు,విశిష్టమైనవి ఏంకాదు. ఇంటర్యూలు పెద్ద ఇష్టం ఉండదు,కానీ ఒంటరిగా ఉండాలనుకునే మనస్తత్వం మాత్రం నాది కాదు. ప్రచారాల పట్ల నాకు ఆసక్తి లేదు. అంటోంది లూయిస్ గ్లాక్. 1968లో ‘ ఫస్ట్ బోర్న్’ పేరిట ఆమె మొదటి కవిత సంకలనం విడుదల అయింది.