పండ్ల గంప ఎత్తుకొని వాడ వాడలా తిరుగుతూ ఆ బరువు తెలియకుండా ఉండేందుకు పాటలు పాడుకుంటూ పండ్లు అమ్మే దాన్ని నా చిన్నతనంలో అమ్మ పాట వినేదాన్ని బతుకమ్మల దగ్గర మా అమ్మ పాడకపోతే ఆట ఆగేది. అక్కడే నేను నేర్చుకున్నా అంటోంది సింగర్ కనకవ్వ కూలీ పనులు చేసి పిల్లలను పెంచుకున్న కనకవ్వ  పాటలు ఆమె పిల్లల యూట్యూబ్ లో పెడితే అవి కాస్త వైరలై ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. నాకు చదువు రాదు కానీ ఎవరైనా పాడి వినిపిస్తే చాలు గుర్తుపెట్టుకుని పాటను వెంటనే పాడగలను పల్లెపదాలు  పాడేదాన్ని కాస్త ఇప్పుడు ఇంకెవరో రాసిన పాటలు కూడా పాడుతున్న. ప్రపంచం తెలియని దాన్ని యూట్యూబ్ సింగర్ ని,ఇంకా సింగర్ కనకవ్వ ని అయ్యాను అంటోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బొడిగేపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ.

Leave a comment