మానవ శరీరానికి సూర్య కిరణాలు సోకితేనే విటమిన్-డి తయారవుతోంది. ఈ లాక్ డౌన్ తో ఎండలోకి వెళ్ళి కాస్సేపు అయినా వాకింగ్ చేసే వీలు కూడా లేదు. కోకోలో ఉండే కోకో బటర్,కోకో బీన్స్,కోకో పౌడర్,డార్క్ చాక్లెట్స్ వంటివి కూడా విటమిన్-డి లభ్యతను మెరుగు పరుస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి.విటమిన్-డి రెండు రకాలుగా అందుతోంది. ఇది డి2,డి3 రూపాల్లో ఉంటుంది డి3సూర్య కిరణాల ద్వారానే అందుతోంది. మిగతాది ఆహారం ద్వారానే అందాలి. కోకో ఉత్పత్తులు డి2 కు ఆధారం వీటిని తీసుకొంటే శరీరానికి డి2 అందుతోంది.

Leave a comment