మొహమంతా తెల్లగా లేదా ఉన్న  ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి కమిలిన నల్ల దనం  పోతుంది. వేపాకుల్లో యాంటీ బ్యాక్తీరియల్  గుణాలుంటాయి. కనుక ఆ ఆకులు  వేసి మరిగించి చల్లనైన నీళ్లలో తరుచు మొహం కడుక్కోవచ్చు. నిమ్మరసం పెరుగు కలిపి వేపాకుపొడి చేర్చి వేపాకుపొడి వేసుకున్నా మచ్చలు పోతాయి. అమ్మవారు వస్తే ఆగాయాల తో గుంతలు ఏర్పడితేనే పసుపు వేపాకు ముద్ద  మంచి నూనె కలిపి రాస్తే అంతగాయాలు మాయం అవుతాయి. అలాంటివి ఎండా వేడిమికి కమిలిన మొహం మెరుస్తూ వుండదా ? ఈ చిట్కా అద్భుతంగ పనిచేస్తుందని చెప్పటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Leave a comment