ప్రతి రోజు అందం కోసం , శరీర లావణ్యం కోసం , సమయం కేటాయించక పోయినా వారానికి ఒక్క రోజు హెర్బల్ నూనెతో శరీరానికి మసాజ్ చేసుకుంటే ముందుగా ఒత్తిడి తగ్గిపోయి మొహం కాంతి వంతంగా ఉంటుంది. కాళ్ళకు స్క్రబ్బింగ్ చేయాలి. ముఖానికి పచ్చిపాలు రాసుకొని కాసేపయ్యాకా కడిగేస్తే చర్మరంధ్రుల తెరుచుకొని మొటిమల సమస్య రాకుండా పోతుంది. ఎండకు చర్మం రంగు తగ్గుతుంది అనుకుంటే నెలకో సారి ఫెషియల్ చేయించుకొంటే సరిపోతుంది. ఎంత పని ఒత్తిడి అయినా కాసేపు అందం,ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి.

Leave a comment