Categories
WhatsApp

నూరేళ్ళు జీవించడం గ్యారెంటీ…………

ఆరోగ్యం విషయంలో ఎవేర్ నెస్ పెరిగాక, ఏ అవయవానికి, ఆ అవయువం ప్రత్యేకంగా వైద్యం చేసే స్పెషలిస్టులు పెరిగాక సాధారణంగా ఆకస్మిక మరణాలు తగ్గిపోతాయి. ఎలాంటి ప్రమాదం లో నుంచి అయినా బయట పడేసే ధన్యంతోరులు, కార్పోరేట్ వైద్యులు వున్నాక ఆయుషు పెరుగుతుందంటారు మెక్ గిల్ విశ్వ విద్యాలయ పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక అధ్యాయినంలో మన్యుషుల ఆయుషు పెరిగిందని తేలింది. ఉదాహరణకు 1920 లో పుట్టిన కెనడా ప్రజల సగటు ఆయుషు పరిమాణం అరవై ఏళ్ళు అదే 1980 నాటికీ 76 సంవత్సరాలయితే ప్రస్తుతం 82 సంవత్సరాలకి పెరిగింది. వైద్య ఆరోగ్య సాంకేతిక రంగాల్లో పురోభివృద్ది కారణంగా ఈ శుభ వార్త రుజువవ్వుతుంది కొంత కాలానికి ప్రపంచంలోని ప్రజలందరూ నూరో పుట్టిన రోజు తప్పనిసరిగా జరుపుకునే రోజు వస్తుందని పరిశోధనలు స్పష్టంగా చెప్పారు.

Leave a comment