వర్షం పడుతుంటే నిప్పుల పైన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినటం అందరికీ ఇష్టమే .న్యూట్రీయంట్లు సమృద్ధిగా ఉండే మొక్కజొన్నలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. వయసుతో పని లేకుండా అందరికీ మొక్కజొన్న శక్తి దాయిని గానే పనిచేస్తుంది. ప్రపంచంలో గోధుమ వరి కన్నా ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న ఇది ధాన్యం వంటి పంటే. పసుపు రంగు మొక్కజొన్న దాదాపు అన్ని దేశాల్లోనూ పండిస్తారు అయితే ఎరుపు,ఆరెంజ్, వంగపండు రంగు ,నీలం, తెలుపు, నలుపుల్లో కూడా పండిస్తున్నారు. తరచూ ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూసుకుంటే కేలరీలు తో పాటు విటమిన్లు తగిన పరిమాణంలో ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది . అనేక పారిశ్రామిక ఉత్పత్తుల్లో మొక్కజొన్న వినియోగం భారీగా ఉంటోంది. కాస్మెటిక్స్ తయారీలో మొక్కజొన్న గింజల నుంచి తీసిన నూనెను విరివిగా వినియోగిస్తారు . వీటి గింజలు కోళ్ల మేతకు ఉపయోగిస్తారు . బేకింగ్ పౌడర్ ల తయారీలో మొక్కజొన్నపిండి వినియోగిస్తారు .ఆయుర్వేద ఔషధాల తయారీలో అనేక మందులు తయారీలో మొక్కజొన్న ఉపయోగపడుతుంది .ఇక విస్కీ తయారీలోనూ మొక్కజొన్న వినియోగాలు ఉంటుంది .కార్న్ ఫ్లేక్స్ సూప్ ల సలాడ్లు కట్ లెట్ లు ఇంకెన్నో ఆ ఆహార పదార్థాలుగా మొక్కజొన్న ను అందరూ ఇష్టపడతారు .
Categories