మనం రోజూ తీసుకునే మెనూ లో బొప్పాయి పండు ఉంటే అది వైరస్ ల నుంచే కాదు మరెన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతోందని చెబుతున్నారు వైద్యులు.బొప్పాయిని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు ఇందులో అనేక పోషకాలు, ఫైబర్ తో పాటు ఫోలేట్ బి6 కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి బి1,బి3,ఇ- కె,పొటాషియం ఉన్నాయి.బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.ఇందులోని సి ఇ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరి తిత్తులు ముక్కు రంధ్రాల్లో శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట నొప్పి,జలుబు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది కేలరీలు తక్కువ.బరువు పెరుగుతాం అనే భయం అక్కరలేదు.

Leave a comment