నటిగా గాయినిగా తన ప్రతిభ నిరూపించుకున్న శృతి హాసన్ ఇప్పుడు నిర్మాతగా బిజిగా ఉన్న అంటోంది. నేను చేయాలనుకొని చేయలేకపోయినా సినిమాలను నా బ్యానర్ పైన నిర్మిస్తాను. వ్యాపారరిత్యా నాకు సినీ నిర్మాణం పైన ఎంతో ఆసక్తి ఉంది. నా సినీ కెరీర్ లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వనే లేదు. ఒక నిర్మాతగా నేను మాత్రం అలా చేయను అంటోంది శృతి. నిర్మాణ రంగంలో అనుభవం లేదు కనుక మా అమ్మ చూసుకోంటోంది. అనుభవం గల నిర్మాతల దగ్గర సూచనలు సలహాలు తీసుకొంటున్నా. మంచి నిర్మాతను కావాలని నా ఆకాంక్ష అంటోంది శృతి హాసన్.

Leave a comment