ఉదయాన్నే ఎంత త్వరగా లేవగలిగితే అంత ప్రయోజనాత్మకంగా సమయాన్ని వినియోగించుకోగలుగుతాం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కనీసం ఏడుగంటలు నిద్రచాలు, తాజాగా ఉండే ఉదయపు గాలి ప్రశాంతంగా అతి విశ్వాసంతో ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే ఒక్క పదిహేను నిమిషాలు ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేందుకు కేటాయిస్తే రోజంతా ఆ ఉత్సాహం వెంటే ఉంటుంది. అ కొద్ది నిమిషాలు మనల్ని మనం సమీక్షించుకునేందుకు గమునించేందుకు పనికి వస్తాయి. ఏ పని చేయకుండా ఉదయం వేళ కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు
ఒక స్పష్టత వస్తుంది. మనం చేసే పనుల్లో లోటుపాట్లు అర్ధం చేసుకునేందుకు ఆ కొద్ది నిమిషాలు సహకరిస్తాయి. మనల్ని మనం చక్కగా అర్ధం చేసుకోగలుగుతాం. మన ఆత్మకు మనం దగ్గరయ్యేందుకు ఈ సమయం చాలు.

Leave a comment