స్నేహితులకి, బందువులకి బహుమతులు ఇస్తున్నాం అంటే ఒక వేడుకని  సెలబ్రేట్ చేసుకోవడం కదా మరి అలా ఎవరికీ వాళ్ళు బహుమతులు ఇచ్చుకోండి. జీవితానికి ఒక ఎస్సెన్స్ లభిస్తుంది అంటార్ ఎక్స్ పర్ట్స్ అవేవీ భారీగా అక్కరలేదు. మనల్ని మనం సంతోష పెట్టుకునే ఒక మంచి సెంట్, చక్కని సువాసన వచ్చే పౌడర్, అందమైన వాటర్ బాటిల్, మంచి పుస్తకం ఇలా సంతోహాన్నిచ్చె వస్తువుని ఒక సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇచ్చుకోండి. ఒక శుభవార్త వింటే ఒక ప్రమోషన్ వస్తే లేదా ఏదైనా ఒంటరిగా చిరాగ్గా అనిపిస్తే ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కోండి. ఆ స్వీయ బహుమతి ఆనందం ఆరోగ్యం ఇస్తుంది అంటున్నారు. మనల్ని మనం సంతోష పెట్టుకుంటే తప్పేమిటి?

Leave a comment