టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి కట్టుగా ముంబాయి వీధుల్లో నడవండి. ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన నేహాసింగ్ సంకల్ప బలం తో ఆకతాయిలను లొంగ దీద్దాం అంది. పురుషులు ఎంత స్వేచ్చగా విహరిస్తున్నారు నాకూ అంతే స్వేచ్చ కావాలి మహిళలకు మాత్రం తక్కువ స్వేచ్చ, ఆంక్షలు ఎందుకు. ఇది అంగీకారం కాదు అంటూ మొత్తం మహిళలంతా గళం విప్పేలా చేయగలిగిన ధిక్కార స్వరం నేహాసింగ్. ఈ ఉద్యమానికి ముంబాయి జోహార్ అంది. టీవి సీరియల్స్ షో స్ లో నేహాసింగ్ , సమీర/ బిజ్లి అన్న పాత్ర ద్వారా అందరికి పరిచయం. స్టార్ ప్లస్ లో వచ్చిన ఫార్ద్ సీరీయల్ భూమిక పాత్రలో నటించిన నేహా ఇప్పుడు సంచలనం.

Leave a comment