ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు దానికి సమయం సందర్భం చూసుకోవాలని కొత్త రిపోర్టు. ఖాళీ కడుపుతో ,ఆకలిగా ఉంటామో ఆ సమయం నిర్ణయాలు తీసుకోనేందుకు అనువైంది కాదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆకలిగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఘ్రెలిన్ నిర్ణయాలు తీసుకొనే సామార్ధ్యంపైన ప్రతి కూల ప్రభావం చూపెడుతోంది… ఆకలిగా ఉన్నప్పుడు ,ఉపవాస సమయాల్లో ఈ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు మెదడు పని తీరులో చాలా వ్యత్యాసాలు చూశామని పరిశోధకులు చెపుతున్నారు. కడుపునిండా తిని విశ్రాంతిగా, స్ట్రెస్ లేకుండా ఉన్న సమయంలోనే నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు బావుంటాయంటున్నారు.

Leave a comment