సినిమా ఇండస్ట్రీలో స్త్రీలపై లైంగిక వేధింపుల విషయంలో క్యాష్ అంటే కమిటీ ఎగైనెస్ట్ సెక్సువల్ ఎరాస్ మెంట్ పేరుతో చిత్ర పరిశ్రమ వ్యక్తులతోనూ బయటి వాళ్ళతోనూ కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన స్త్రీలు తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అందులో కంగానా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందే ఉంటుంది. ప్రశ్నను బట్టీ సమాధానం షూటిగా వచ్చేస్తుంది. ఒక ఇంటర్వూలో మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని విలేఖరి అడిగితే నాతో నటించే ప్రతి హీరోతోనూ నాకు రిలేషన్ ఉంటుంది అలాటప్పుడు ఒకరి గురించి మాట్లాడటమంటే కష్టం అనేసింది. కోపంగా ఉన్నాదా, సమాధానం చెప్పిందా అన్న ప్రశ్న అవతలపెడితే ఆడపిల్లలు నిలదోక్కుకోవాలుకోనే రంగంలో కాస్త గట్టిగానే కష్టపడాలి ,నిలబడాలి సమాధానం చెప్పాల్సి  వస్తే కంగనా లాగా ఎదుటి వాళ్ళ నోళ్ళు మూయించాలి.

Leave a comment