అన్ని ఉడికిస్తే వంట అయిపోతుంది అనుకొంటారు.కానీ ఒకేలా వండేయటం నష్టం అంటారు న్యూట్రిషనిస్టులు. బంగాళా దుంపలు చిన్న ముక్కలు చేసి ఉడికిస్తే పోషకాలు పోతాయి. బాగా కడిగి పోట్టుతో ఉడికించి అటు తరువాత ఏ కూరైన వండుకోవచ్చు.క్యాబేజీ ఉడికించేప్పుడు కాస్త వెన్న వేసి ఉడికిస్తే పోషకాలు పోకుండా ఉంటాయి. అతిగా ఉడికితే సల్ఫర్ విడుదలై మొత్తం రచి మారిపోతుంది. అలాగే ప్రతి కూరలో ,సలాడ్స్,బర్గర్ లు,శాండ్ విచ్ల్లో ఉల్లిపాయ ముక్కలు చాలా రుచి ఇస్తాయి. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది కనుక ఇది జీవక్రియ రేటు పెంచుతుంది.కనుక ఉల్లిపాయ వేయించకుండా ఉడకనివ్వకుండా యాధావిధిగా కూరల్లో చేర్చటం మంచి పద్దతి. అలాతగే మాంసం ,చేపలను ఎక్కువ ఉడికిస్తే మాంసకృత్తులు పోతాయి. కనుక తక్కువ వంటపైన నెమ్మదిగా ఉడకనివ్వాలి.

Leave a comment