మతిమరుపు మానవ సహజం, అయినా జ్ఞాపకశక్తికి ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిందే. అంతేగాని ఎదుటి వాళ్ళ పేరు గుర్తుకు రావడం లేదని, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నామని సమస్యను పెద్దది చేయకూడదు. బహుళ పనుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కనుక ఒకసారి ఒకా పని పైనే ఫోకస్ చేయాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి వైపే చూస్తూ సన్నిహితంగా వినాలి. ఏదైనా వినడం మిస్సయితే రిపీట్ చేయమని అడగాలి. ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు అర్ధం కాకపోతే క్లారిఫికేషన్ కోసం చూడాలి. ప్రశ్నలు వేస్తే ఎవరేమనుకొంటారో, నవ్వుకుంటారోననే సంశయo పడనే కూడదు.వినడానికి కాస్త బావుండక పోయినా, కొత్త సమాచారం లేదా గుర్తుండి తీరవలసిన విషయం ఎవరికి వాళ్ళు రిపీట్ చేసుకుంటే బాగా గుర్తుండి పోతుందని పరిశోధనల్లో గుర్తించారు. చిన్నవే కదా అని చిన్న పనులు విస్మరించవద్దు. త్వరత్వరగా వాటిని పూర్తి చేయకపోతే అవే పేరుకుపోయి చికాకు పెడతాయి. ముందు ప్రతి విషయం రాసుకోవడం, చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Leave a comment