రైల్వే ప్లాట్ ఫామ్ పైన పాటలు పాడుతూ బిచ్చం ఎత్తిన రాణు మరియామండల్ రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయింది . పశ్చిమ బెంగాల్ నాయికా జిల్లాలోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం పైన పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంది రాణు . జులై 21 తేదీన “ఏక్ ప్యాక్ నాగమ హై ” అన్న షార్ చిత్రంలో లతామంగేష్కర్ పాట పడుతుంది రాణు. ఆ పక్కనే వింటూ కూర్చున్న అతాంద్రి చక్రవర్తి అనే యువకుడు వీడియో తీసి పోస్ట్ చేశాడు . ఒక్క నిమిషంలో ఆమె పాట వైరల్ అయింది . రేడియో ,చానళ్ళు ,సినీనిర్మాతలు ,స్థానిక కచేరి వాళ్ళు ఆమెకు అవకాశం ఇస్తామని క్యూ కట్టారు . సంగీతంలో ఓనమాలు రాణి రాణు జీవితం మారిపోయింది .

Leave a comment