చాలా మందికి దుస్తులు కొనటం హాబీ . కనిపించిందల్లా కొనేయటం,కంటికి నచ్చినవి రెండో ఆలోచన లేకుండా ఎంత ఖరీదైనా ఇచ్చేయటం చేస్తారు . అలాటి బలహీనత ఉంటే కొన్ని చిట్కాలు పాటించండి ,ముందుగా పర్స్ లో క్రెడిట్ ,డెబిట్ కార్డులు పెట్టుకోవద్దు . ఇంతే ఖర్చుచేస్తాం అనుకోని డబ్బు పర్స్ లో పెటుకోంటేచాలు . అలాగే వెళ్లేముందు బీరువా తీసి ఒక్కో రంగులు ఎన్నున్నాయో ,వాటిని ఎన్నిసార్లు వాడారో చూసుకొంటే కూడా మంచిదే . బావుంది అని డ్రస్ కనిపించగానే బీరువాలో హేంగర్ కి తగిలించిన ఏ కలర్ డ్రస్ గుర్తుకొస్తుంది . రాయితీ లు దృష్టిలో పెట్టుకొని రెండు కొంటే ఒకటి ఉచితం కదా అని కొనేయద్దు . అవి మనసు నప్పుతాయా లేదా ఆలోచించు కోవాలి .

Leave a comment