బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు వాడాలి. లేత రంగులో తెలుపు రంగు వెచ్చని నీళ్ళే ఉత్తమం. కొన్ని దుస్తుల్ని కొంత సేపు ధరించి ఎండలో ఆరేసి మడతేసి ఇంకోసారి వాడతారు. మిగతావాటి సంగతి ఎలా వన్నా లెనిన్ తరహ  వస్త్రాలు మాత్రం వదిన వెంటనే ఉతికేయాలి. లేదంటే చమట కారణంగా వాటిలో ఫంగస్ పేరు కొంటుంది. రేయాన్ దుస్తుల్ని బ్లీచింగ్ లో వేయకూడదు. మెలితిప్పి పిండకూడదు. పాలిస్టర్ చల్లని నీటితో ఉతికి అలాగే ఆరేయాలి. పట్టు సిల్క్ రకాలు చల్లని నీటి లో ఉతికి అలాగే ఆరేయాలి, పిండకూడదు. ప్రతి దుస్తులను ఉతికేందుకు దానికి ప్రత్యేక పద్దతులు వుంటాయి.

Leave a comment