బంగారం ,వైడూర్యం రత్నాలు కలగలిసిన ఈ జిప్షియన్ నగలు సంప్రదాయాలు హస్తకళల రూపాల్లో ఉంటాయి . వెండి రాగి కలిపినా ఈ ఆభరణాలు ఎరుపు ,గోధుమరంగుకీ తెచ్చిన బంగారంతో చేసేవారు . రాగి,ఇనుము ,వెండి వంటి మూలకాల్తో బంగారానికి రంగులు తెచ్చేవారు . పూసల వరసలు పువ్వులు జంతువుల ఆకారాలు ,మనుషులు ,జంతువులు దేవతలలో సహా వివిధ రూపాల్లో ఈ నగలు తాయారు చేశారు . ఈజిప్టు రాజులూ రాణుల కోసం తయారు చేసిన ఈ ఆభరణాల్లో విలువైన రంగురాళ్ళు పొదిగిన బరువైన ఆభరణాలు ఫ్యాషన్ జువెలరీలు భాగమైపోయాయి . దేవదూతలు,సూర్యచంద్రుల రూపాలు అందమైన కర్ణాభరణాలు ఇప్పుడు అమ్మాయిల మనసు గెలుచుకున్నాయి .

Leave a comment