చేతి గోళ్లు బలహీనంగా ఉన్న,విరిగిపోతున్న,రంగు మారినట్లు అనిపించిన ఇంట్లో దొరికే పదార్ధాలతో వాటిని బలంగా మారేలా చేయచ్చు. లిక్విడ్ బాత్ సోప్ తో గోళ్లను శుభ్రం చేయాలి. తరువాత ఆలివ్ నూనెతో మర్దన చేయాలి. ఆలివ్ నూనె లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గోళ్లకు తేమను ఇస్తుంది. అలాగే ఒక గిన్నెలో గోరు వెచ్చని పాలు పోసి అందులో గోళ్లను ముంచి కొన్ని నిముషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లతో కడిగి మొయిశ్చ రైజర్ రాస్తే సరిపోతుంది. కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా చేసి కాసేపు నాననివ్వాలి. ఆ తరువాత మునిగేలా చేసి కాసేపు నాననివ్వాలి. తరువాత గోళ్లు శుభ్రం చేసుకొని పెట్రోలియం జెల్లీ రాస్తే గోళ్లు తాజాగా ఉంటాయి.

Leave a comment