కరోనాని కట్టు దిట్టంగా కట్టడి చేస్తున్నారు ఈ సర్పంచును ప్రధాని మోది మెచ్చుకొన్నారు. పూణే లోని మోడాంకార్ వాడీ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాందాస్  మోడాంకారీ. ఈమె లాక్ డౌన్ అయిన రెండవ రోజే రంగంలోకి దిగి గ్రామంలోని వీధి వీధికి సోడియం హైపో క్లోరైట్ ద్రావకాన్ని చెల్లించారు. స్కిల్ ఇండియా ప్రోగ్రాం క్రింద మహిళా సహాయక బృందాలకు చెందిన కొందరికి ఫేస్ మాస్క్ ల తయారీ లో శిక్షణ ఇప్పించారు వారు కుట్టిన ఐదువేల మాస్క్ లు గ్రామంలో పంచారు. గ్రామంలో హోమ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఊరిలోని ప్రతి మహిళకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్ లు అందజేశారు.

Leave a comment