లాక్ డౌన్ తో సరుకులు కొనుక్కొనే వార్లు దాదాపు కుదించారు. మార్కెట్ కు వెళ్ళి సరుకులు కొనుక్కోవటం కన్నా ఆన్ లైన్ లో తెప్పించు కోవటం బెస్ట్ అంటున్నారు చాలామంది. సాధారణంగా షాపు కు వెళితే వస్తువులు ముట్టుకోవటం,వెనక్కి పెట్టటం,షాపింగ్ బెల్ట్ దగ్గర క్యాష్ కౌంటర్,ఎ.టి.ఎం,బిల్లు తీసుకొనేప్పుడు కార్ పార్కింగ్ దగ్గర మనుషులను దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. షాపింగ్ కు వెళ్ళేముందు,వచ్చిన తర్వాత కూడా శానిటైజర్ తో సబ్బునీళ్ళతో 20 సెకండ్లు తప్పని సరిగా చేతులు కడుకోవాలి,షాపింగ్ ట్రాలీలు వస్తువులు ముట్టుకొన్నాక ఆ చేతులతో ముఖాన్ని తాకవద్దు లేదా ఆన్ లైన్ లో తెప్పించుకొన్న ప్యాక్ చేసిన వస్తువులు వాడుకొనే ముందు 72 గంటలు నిల్వవుంచి,వాటిని వాడే కవర్ తో  సహా బ్లీచింగ్ తో శుభ్ర పరచి వాడుకోవాలి. ఆన్ లైన్ డెలివరీ సురక్షితమైంది. డెలివరీ చేసే వ్యక్తి ద్వారా ప్యాకేజింగ్ ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది. సరుకు డెలివరీ చేసిన వ్యక్తిని దూరం నుంచే డబ్బు చెల్లించి ఆ సరుకులు యధావిధిగా శుభ్రం చేసి వాడుకోవటం బెస్ట్.

Leave a comment