Categories

అమెజాన్ ప్రైమ్ లో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణా రోహిత్ మిర్జాపూర్, పాతాళలోక్ వంటి ఆదరణ పొందిన వెబ్ సీరీస్ ఆమె ఆధ్వర్యంలోనే లోనే ప్రైమ్ లో ప్రసారం అయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం లో మాస్ కమ్యూనికేషన్ చదివే రామే కథలు చెప్పడం ఇష్టం రచయితలకు అసిస్టెంట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వచ్చిన ఉద్యోగం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రచయితల పరిచయాన్ని ఇచ్చింది. తర్వాత ఆమె అమెజాన్ లో అడుగుపెట్టారు. నేను విన్న కొత్త కథలకు ప్రాణం పోసేందుకు అమెజాన్ మంచి వేదిక అయింది.కలలంటూ ఉంటే వాటిని నిజం చేసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అంటుంది అపర్ణా రోహిత్.