భారతీయ నిర్మాత సునీత మెంగా సారధ్యంలో ఇరానియన్ అమెరికన్ దర్శకుడు రైకా జెహ్ తాబ్బీ తెరకెక్కించిన డాక్యూమెంటరీ పీరియడ్ ఎండ్ అప్ సెంటెన్స్ లఘు కథాంశ చిత్రాల కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఢిల్లీ సమీపంలోని హస్కర్ గ్రామంలో కొంతమంది మహిళలు రుతుస్రావం చుట్టు ఉన్న దురాభిప్రాయాలు దురాలోచనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ఫ్లయ్ అనే బాండ్ నేమ్ లో తామే సొంతంగా శానిటరీ ప్యాడ్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. స్పూర్తిదాయకమైన ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపికైంది.

Leave a comment