ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాని కోసం పరుగు తీయడం అవసరమే కానీ దాని వల్ల కలిగే ఒత్తిడి మాటేమిటి ?  ఇందుకు గానూ ఒత్తిడిని తగ్గించే ఆహారం గురించి ఆలోచించమంటున్నారు ఎక్స్ పర్ట్స్.  అమ్మాయిల్లో సాధారణంగా కనిపించే పోషకాహార లోపంలో కాల్షియం ముఖ్యం . అందుకే పాలు తప్పని సరిగా తాగాలి.  పాలల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు ,బయోయాక్సిన్ ప్రోటీన్లు ఒత్తిడిని నిరోధించటంలో కీలకంగా పని చేస్తాయి.  అలాగే భాధంలో ఉండే పోషకాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. చేపల్లో లభించే ఫ్యాటీ ఆమ్లాల్లో ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసాల్,అడ్రినలిన్ స్థాయిలో కూడా తగ్గించే గుణం ఉంటుంది.  అలాగే పాలకూరలో లభించే మెగ్నిషియం భావోద్వేగాలను అదుపు చేయగలుగుతోంది.

Leave a comment