ఆకుపచ్చ రంగు అంటేనే ప్రశాంతత. ఎదుగుదల, కొత్త ఉత్సహాం ,చక్కని ఆలోచన వైపు మళ్ళించగల శక్తి, శుభసూచక మని అంటారు. సాధారణంగా ఆస్పత్రిలో కర్టెన్ , బెడ్ పైన వేసే దుప్పట్లు , ఆస్పత్రి ముందర పచ్చని లాన్ లు ఇవన్ని రోగికి కోలుకొనే ఉత్సహాం ఇచ్చేందుకే . ఎలాంటి మూడ్ లో ఉన్న సరే ప్రశాంతతను ఇచ్చే శక్తి పచ్చదనంలో ఉంది. అందుకే ఇంట్లో ,పని ప్రదేశంలో ఓ మూలగా పచ్చని చెట్టు కుండీలో ఉండేలా చూసుకోవాలి. కిటికీ లోంచి ఎదుట పచ్చని చెట్టు కనిపించాలి ,మనసు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

Leave a comment