ఎక్కువ ఆందోళన పడినా ఒత్తిడితో సతమతమైనా ముఖ్యంగా ఎముకలకు ప్రాబ్లం అంటున్నారు వైద్యులు. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యాయనాలు. ఆందోళనకు గురయ్యే మహిళల్లో ఖనిజాల శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. ఎముకలు బలహీనపడి అతి చిన్న ప్రమాదాలను కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. డీ విటమిన్ స్థాయి పడిపోతాయి. శరీరం ఇన్ ఫెక్షన్ తట్టుకునే శక్తిని పొగొట్టుకుంటుంది. విటమిన్‌ డీ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గుడ్లు బాదం, సోయా, బ్రకోలి,అవిసె గింజలు, పప్పు ధాన్యాలు తింటే మంచిదంటున్నారు.

Leave a comment