ఉక్రెయిన్ కు చెందిన శిల్పి అలగ్జాండర్ మెలోవ్ చేసిన ఒక వైర్ ప్రేమ్ చిత్రం కెనడా లో జరిగిన బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ లో ఆకర్షనీయంగా నిలిచింది ఈ శిల్పాన్ని దిసీజ్ అవర్ పవర్ ఆఫ్ ఆర్ట్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ శిల్పంలో ఇద్దరు వ్యక్తులు ఎడమొహం, పెడమొహం తో కూర్చుని ఉంటారు.వారి లోపల ఇద్దరు పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రతి మనిషిలో సహజమైన గుణం ఇదే ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ వారి లోపలి చిన్న పిల్లల స్వభావం మాత్రం మారకుండా అలాగే ఉంటుందని ఈ శిల్పి సందేశం.ఎదుటివారితో అభిప్రాయ బేధాలు మొలకెత్తినప్పుడు మన లోపలి బాల్యం అంటే మనకు క్షమించమని ప్రశాంతంగా ఉండమని కోరుకుంటుంది ప్రేమని పంచే ఈ శిల్పం అందరినీ   ఆకర్షించింది.

Leave a comment