ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు దీని సొంతం. రోగ నిరోధక శక్తిని పెంచగల ముల్లంగి విటమిన్-సి, పోటాషియం, సోడియం, తదితర ఖనిజాలు, విటమిన్లు, పిచు తో నిండి వుంటుంది. ముల్లంగి సలాడ్ గానూ, పచ్చి గాను తీసుకోవచ్చు. ఉడికించాలి అంటే తక్కు నీళ్ళు పోయాలి. ఆ ఉడక బెట్టిన నీటిని పరబోయ కూడదు. పులుసు, సాంబార్ లో కలుపుకోవచ్చు. రెండు నెలల పాటు ఉదయం లేవగానే ముల్లంగి జ్యూస్ తాగితే మొత్తం జీర్ణ వ్యవస్థ బాగు పడుతుంది. సలాడ్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ముల్లంగి రసం చర్మానికి రాసుకుంటే కాంతి వంతంగా తయ్యారవ్వుతుంది. ఎన్నో అనారొగ్యాలను అడ్డుకోగల ముల్లంగి వారానికి రెండు సార్లయినా భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

Leave a comment