కాకర కాయ……… అబ్బా చేదే ఏమాత్రం నోటికి ఇంపుగా లేని కురగాయే కానీ ఈ కాయను మించిన ఔషదం లేదంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ కాకరకాయ కూర తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాకరకాయ రసం ఒక దివ్య ఔషదం. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉదయం పూట ఈ జ్యూస్ ఎలాగైనా తాగ గలిగితే శరీరం లోని ఆల్ఫాగ్లూకోసైడ్స్ తగ్గిపోతాయి. ఇందులో వుండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ లెవెల్ ను తగ్గించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాకరలో ఎ,బి,సి విటమిన్లు, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్, జింక్, మేగ్న్రీషియం, మాంగనీస్ ఎక్కువే ఉంటాయి.

Leave a comment