లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం ధరించే వాళ్ళు మరి ఎటూ 750 కోట్ల అడుగుల డెనిమ్ క్లాత్ ప్రపంచ వ్యాప్తంగా తాయారు అవుతుంది. దీని కోసం ఎంతో నీరు, ఎంతో శ్రమ, ఎంతో ఇండిగో రంగు కావాలి.ఈ జీన్స్ ఎటూ వెయ్యి కిలోల చెత్త కింద పేరుకు పోతుంది. మరి దీన్ని తిరిగి ఉపయోగించ పొతే ఎలా? ఈ పనికి లీవైజ్ స్ట్రాస్ కంపెనీ నే శ్రీకారం చుట్టింది అమెరికా లో ని ఇళ్ళు  నిర్మాణం లో ఇన్సులేషన్ ప్రక్రియను వాడుతుంది. అలాగే జీన్స్ క్లాత్ తో రకరకాల ప్రయోగాలు వస్తున్నాయి. బుక్ స్టాండ్లు చెప్పులు, గొడుగులు, సాఫ్ట్ టాయ్ లు, దిళ్ళు, టీ పాయి లు, ఫోటో ఫ్రేములు, టేబుల్ మ్యాట్లు, మొక్కల్ని పెంచే కుండీలు, కూడా చేస్తున్నారు. పాత బంగారం కరగాబెట్టి కొత్త నాగ చేసి నట్లు పాత జీన్స్ ప్యాంటు తో ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా జీన్స్ రీసైకిలింగ్ చేసి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా డెనిమైట్ అనే ధృడమైన ప్లాస్టిక్ ని రూపొందించారట. ఐరిష్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీనిలో బాటిల్స్ దగ్గర నుంచి దశ బోర్డ్ ల దాకా తాయారు చేసారు.

Leave a comment