కొత్త ట్రెండ్ ఏదైనా ముందుగా సినిమా స్టార్స్ దగ్గరనుంచే ప్రజల్లోకి దూకుతుంది. పచ్చబొట్ల ఫ్యాషన్ వచ్చాక శ్రుతిహాసన్ వంటి పైన ఐదు పచ్చబొట్లు వేయించుకుంటారు. ఆ సరదా అయిపోయాక ఆ పచ్చబొట్లతోనే పెద్ద సమస్య అయిపోతుంది అంటుంది శ్రుతిహాసన్. చేతి మణికట్టు దగ్గర నాకు అందమైన పచ్చబొట్టు వుంది. సినిమా చిత్రకరణ సమయంలో దాన్ని మాయం చేయడానికి ఎంతో మేకప్ అవసరం అవ్వుతుంది. ప్రతి సినిమాకు నానా పట్లు పడుతున్నా అంటోంది శృతి. ఇవి ఆమెకే కాదు అందరి అమ్మాయిలకు కుడా. గబుక్కున సరదా ఎక్కువై పచ్చబొట్లు వేయించుకుంటే అది శాశ్వతంగా వంటి పైన వుంటుంది. దాన్నివదిలించు కోవాలంటే మొత్తం చర్మం తొలగించినంత పని అవ్వుతుంది కదా అందుకే ఇలాంటి ఫ్యాషన్స్ ఎంత వురించినా కాస్త అలోచించ మని చెప్పుతున్నాట్టే వుంది శృతి అనుభవం.

Leave a comment