అనంతాళ్వార్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతి కరమైన భక్తుడు.నిత్య నిర్మలమైన మనసుతో భగవంతుడుకి కైంకర్యం చేసుకున్నాడు.

ఆళ్వార్ తిరుమల కొండ పైన స్వామి వారి సన్నిధిలో పూలతోటను పెంచి ఆ వనంలోని పుష్పాలను స్వామికి సమర్పించు కోవాలని గర్భవతి అయిన  తన సహధర్మచారిణితో కొండ పైన నివసిస్తూ ఉండేవాడు.తోటలో పనిచేస్తున్న సమయంలో ఒక బాలుడు తన వంతు సాయం చేస్తానన్న ఆళ్వార్ కోపంతో నిరాకరించి ఆ బాలుడిని తన చేతిలో ఉన్న గునపముతో కొట్టిన స్వామి వారి గడ్డం కి గాయం కాగా వెనుదిరిగి చూచిన ఆళ్వార్ తన తప్పు గ్రహించి వెంటనే స్వామి వారి గడ్డం వద్ద పచ్చ కర్పూరం అద్ది శాశ్వతంగా శ్రీ వత్సుడైనాడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర,దద్ధోజనం.

స్వామి వారి ఇష్టాలు: కర్పూరం జోడించి ముడుపులు చెల్లించడం,జోగి ఎత్తడం, తలనీలాలు సమర్పించడం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment